Weather Updates: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

Weather Updates: గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి.

Update: 2020-08-22 03:06 GMT

Heavy Rains in AP

Weather Updates: గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ వాగులు, వంకలు, నదులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికే వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ప్రజల జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. అయితే వర్షాలు మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు ప్రజలకు మరో షాక్ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. అయితే, తూర్పు మధ్యప్రదేశ్‌ మధ్య భాగం, వాటి పరిసర ప్రాంతాల్లో అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్‌ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఇదే క్రమంలో వాయవ్య బంగా‌ళా‌ఖా‌తం, వాటి పరిసర ప్రాంతాల్లో ఈ నెల 23న మరో అల్ప‌పీ‌డనం ఏర్పడే అవ‌కాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన పప్రభావం రానున్న 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మరి ఏపీలో పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాసం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురిసే అవకాసం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యలుగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

అంతే కాదు, అల్పపీడన ప్రభావంతో ఏపీతో సహా తెలంగాణాలో కుడా పలు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాసం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే సాదారణ వర్షపాతం కంటే సుమారు 44 శాతం అధికంగా వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News