Weather Updates: బలపడిన అల్పపీడనం.. నాలుగు రోజుల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Weather Updates: బలపడిన అల్పపీడానికి నైరుతి రుతుపవనాలు తోడు కావడంతో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2020-08-05 02:30 GMT
weather Updates

Weather Updates: బలపడిన అల్పపీడానికి నైరుతి రుతుపవనాలు తోడు కావడంతో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు బలమైన గాలులు వీస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన జల్లులు బుధవారం కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉత్తరబంగాళాఖాతంలో మంగళవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం బలపడింది. మంగళవారం రాత్రికి పశ్చిమంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమబెంగాల్‌, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా 7.6కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం నెలకుంది. దీనివల్ల నైరుతీ రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. దీనివల్ల రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఈ నెల 8న ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న మూడురోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో చెరువులకు, కుంటలకు జలకళ వచ్చింది.

Tags:    

Similar News