అతి తీవ్ర తుపానుగా మారిన 'అంఫన్‌'

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర తుఫాన్ అంఫన్‌ మరింతగా బలపడి తీవ్రం కానుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Update: 2020-05-18 02:35 GMT

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర తుఫాన్ అంఫన్‌ మరింతగా బలపడి తీవ్రం కానుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఏపీలో కుడా ఓ మోస్తరు వర్షాలకు మాత్రమే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏపీలో తుఫాన్ తీరం దాటాకపోయినా ఆదివారం ఉరుములు, ఈదురు గాలులతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.

మరికొన్ని జిల్లాల్లో కూడా అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇటు తెలంగాణలో కూడా సోమ, మంగళవారం అక్కడక్కడా ఉరుములు, బలమైన గాలులతో చిన్న పాటి వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావం ఉన్నందున మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. 

Tags:    

Similar News