Dharmana PrasadaRao: దశాబ్ధాలుగా పెండింగులో ఉన్న దేవస్థాన భూమి వివాదాన్ని పరిష్కరించాం
Dharmana PrasadaRao: త్వరలోనే ఆ భూమిని రికార్డును దేవస్థానానికి అందజేస్తాం
Dharmana PrasadaRao: దశాబ్ధాలుగా పెండింగులో ఉన్న దేవస్థాన భూమి వివాదాన్ని పరిష్కరించాం
Dharmana PrasadaRao: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మ వార్లను ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆలయ అర్చకులు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. మంత్రి ధర్మాన దంపతులు శ్రీస్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం అమ్మవారి మండపంలో ధర్మాన దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మంత్రి దంపతులకు శ్రీస్వామి అమ్మ వార్ల చిత్రపట జ్ఞాపికను, శేషవస్త్రాలు, లడ్డు ప్రసాదాలను అందజేశారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మ వారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి ధర్మనా 10 సంవత్సరాల క్రితం క్షేత్రానికి వచ్చానని, శ్రీశైల క్షేత్రం చాలా అభివృద్ధి చెందిందన్నారు. ఎన్నో దశాబ్ధాలుగా పెండింగులో ఉన్న దేవస్థాన భూమి వివాదాన్ని మూడు శాఖల అధికారులతో మాట్లాడి 5 వేల 3 వందల ఎకరాలను గుర్తించామన్నారు. త్వరలోనే ఆ భూమిని రికార్డును దేవస్థానానికి అందజేస్తామన్నారు మంత్రి. ఎన్నో ఏళ్లుగా శ్రీశైల క్షేత్ర భూవివాదాన్ని పరిష్కరించుకున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని మంత్రి అభినందించారు.