CM Jagan: పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం
CM Jagan: కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
CM Jagan: పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం
CM Jagan: వెయ్యి 72 కోట్ల విలువైన పరిశ్రమలకు క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్‌గా సీఎం జగన్...శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 21వేల79 మందికి ఉపాధి కలగనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో 402 కోట్లతో నెల్లూరు జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో సిగాచి ఇండస్ట్రీస్ గ్రీన్ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో-ఇథనాల్ తయారీ యూనిట్లను ఆయన ప్రారంభించారు. పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోందని..కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ తెలిపారు.