శ్రీశైల జలాశయానికి నిలిచిపోయిన నీటిప్రవాహం

Update: 2019-11-29 02:40 GMT

వర్షాలు, వరదలు తగ్గిపోవడంతో శ్రీశైల జలాశయానికి నీటిప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో డ్యాం పూర్తిస్థాయి నీటినిల్వలు 215.8070 టీఎంసీలు, నీటిమట్టం 885 అడుగులు కాగా గురువారం సాయంత్రం 6గంటల సమయానికి జలాశయ నీటినిల్వ సామర్థ్యం 185.5638 టీఎంసీలుగా, డ్యాం నీటిమట్టం 879.50 అడుగులుగా నమోదయింది. నీటి ప్రవాహం నిలిపోవడంతో శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో పీక్‌లోడ్‌అవర్స్‌లో మాత్రమే విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాజెక్టు జూరాల జలాశయానికి నీటిప్రవాహం నిలిచిపోవడంతో దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి ప్రవాహం తగ్గించినట్టు అధికారులు తెలిపారు. ఈ కారణంచేత పీక్‌లోడ్‌ అవర్స్‌లో డిమాండ్‌కు అనుగుణంగానే విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 28, 252 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Tags:    

Similar News