ఏపీలో వాయిదా వార్

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా రాజకీయ రగడకు దారి తీసింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు

Update: 2020-03-15 15:46 GMT
chandrababu, jagan (File Photo)

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా రాజకీయ రగడకు దారి తీసింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు రాష్ర్ట ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ ఇష్టానుసారంగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. మరో వైపు జగన్ తీరుపై టీడీపీ నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ఆరోగ్యం పట్టించుకోరంటూ దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ర్ట ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ ఏదీ రద్దు కాబోదని.. నామినేషన్లు, ఏకగ్రీవాలను గుర్తిస్తామని స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.

కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలని రాష్ర్ట ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎన్నికలు వాయిదా వేసే ప్రభుత్వ కార్యదర్శులను సైతం సంప్రదించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ పై సీఎం జగన్ గవర్నర్ కు పిర్యాదు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ వ్యవహరించి తీరును టీడీపీ అధినేత చంద్రబాబు తప్పు బట్టారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే ప్రమాదం ఏమీ లేదని సీఎం జగన్ చెబుతుండటం బాధ్యతా రాహిత్యాన్ని వెల్లడిస్తుందన్నారు. జగన్ కు రాజకీయ ప్రయోజనాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు.

మొత్తానికి ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదాపై ఇతర పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో స్పందించాయి. బెదిరింపులతో ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందాలని వైసీపీ చూస్తుందని ఆరోపిస్తున్నాయి.  

Tags:    

Similar News