Vundavalli Arun Kumar: ఉద్యోగ సంఘాల సమ్మెపై ఉండవల్లి కామెంట్స్
Vundavalli Arun Kumar:కొత్త జీతాలు వద్దు, పాతవే ఇవ్వండని సమ్మెకు దిగడం వింతగా ఉంది
ఉద్యోగ సంఘాల సమ్మెపై ఉండవల్లి కామెంట్స్
Vundavalli Aruna Kumar: ఏపీ ఉద్యోగ సంఘాలు సమ్మెబాట పట్టడంపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా విలయం, మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో ఉద్యోగులు సమ్మె ఆపాలని ఆయన కోరారు.. ఉద్యోగ సంఘాలు పంతాలు,పట్టింపులకు పోకుండా చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలన్నారు..కొత్త జీతాలు వద్దు, పాతవే ఇవ్వండి సమ్మెకు దిగడం గతంలో ఎప్పుడూ తాను చూడలేదని వింతగా ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.