పెన్షన్ పెరిగిందని సంతకం.. ఆస్తికే ఎసరు పెట్టిన వాలంటీర్..

Kakinada: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ వాలంటీర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు.

Update: 2022-03-24 13:00 GMT

పెన్షన్ పెరిగిందని సంతకం.. ఆస్తికే ఎసరు పెట్టిన వాలంటీర్..

Kakinada: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ వాలంటీర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. వృద్దురాలికి పింఛను ఇస్తూ ఆమె వేలి ముద్రలను వేయించుకుని ఏకంగా ఆస్తులను రాయించుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. కాకినాడ గ్రామీణ మండలం గంగనాపల్లిలో 75 ఏళ్ల వృద్దురాలు వాసంశెట్టి మంగాయమ్మ తన కుమారుడు విశ్వనాథంతో కలిసి నివసిస్తోంది.

మంగాయమ్మకు ప్రభుత్వ వృద్ధాప్య పింఛను అందుతోంది. అయితే వాలంటీర్ రవికుమార్ జనవరిలో పింఛను పెరిగిందని చెప్పి కాగితాలపై వేలిముద్రలు వేయించుకొని వెళ్లాడు. ఆ తర్వాత ఆస్తి జప్తు చేసినట్టు నోటీసులు రావడంతో తల్లీ కొడుకు ఖంగుతిన్నారు. కుల ధృవీకరణ పత్రం కోసమే వేలిముద్రలు వేయించుకున్నానని ఆస్తి కోసం కాదని వాలంటీర్ చెబుతున్నారు.

Tags:    

Similar News