Vizianagaram: ఘనంగా ప్రారంభమైన పైడితల్లి సిరిమానోత్సవం
Vizianagaram Pydithalli Ammavari Festival Sirimanotsavam Begins Grandly with Devotee Rush
Vizianagaram: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కన్నుల పండువగా ప్రారంభమైంది.
అమ్మవారి పూజారి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. ఈ సిరిమానును చదరగుడి నుంచి చారిత్రక విజయనగరం కోట వరకు ఊరేగించనున్నారు.
భక్తుల జయజయ ధ్వానాల నడుమ అమ్మవారి సిరిమాను ముందుకు సాగుతోంది. ఈ ఊరేగింపులో ముందుగా పాలధార, తెల్ల ఏనుగు, జాలరివల మరియు అంజలి రథం వంటి సంప్రదాయ చిహ్నాలు అలంకరించి వెళ్తున్నాయి.
ఈ అద్భుతమైన ఉత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కూడా ఈ సందర్భంగా సిరిమానును దర్శించుకున్నారు.