Vizag: అంతర్జాతీయ వేడుకలకు ముస్తాబవుతున్న విశాఖ నగరం

Vizag: రూ.130 కోట్లతో విశాఖ సుందరీకరణ పనులు

Update: 2023-02-13 02:17 GMT

Vizag: అంతర్జాతీయ వేడుకలకు ముస్తాబవుతున్న విశాఖ నగరం

Vizag: విశాఖ నగరం అంతర్జాతీయ సదస్సులకోసం ముస్తాబవుతోంది. దశలవారీగా ఇన్వెస్టర్స్ సమ్మెట్, జీ.20 సదస్సులు విశాఖలో జరుగనున్నాయి. దీంతో విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునే విధంగా నగర సుందరీకరణ పనులు చేపట్టారు. ఇంటర్నేషల్ ఈవెంట్స్ తో విశాఖ నగరం కొత్త అందాలను సంతరించుకుంటోంది.

విశాఖ నగరం అంతర్జాతీయ వేడుకలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. సాగర్ తీరం, ఫైవ్ స్టార్ హోటల్స్, విశాలమైన రోడ్లు, విమాన సర్వీసులు అందుబాటులో ఉండటంతో విశాఖ ప్రపంచదేశాలను ఆకట్టుకునే విధంగా ముస్తాబైంది. ప్రభుత్వాధినేతలు విశాఖపైనే ఫోకస్ పెట్టడంతో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ రోజురోజుకీ రెట్టింపవుతోంది.

విశాఖలో మార్చి నెల 3,4 తేదీలలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మెట్, అదే నెల లో 28, 29,30 తేదీల లో జీ.20 సదస్సు నిర్వహిస్తున్నారు. దాదాపు 46 దేశాల నుండి డేలిగెట్స్ హాజరు అవుతున్నారు. దీంతో వచ్చే అతిథుల కోసం నగరంలో హోటల్స్ అన్ని బుక్ చేశారు. మరోవైపు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నగర సుందరీకరణ పనులు పూర్తి చేస్తున్నారు . లాండ్ స్కేప్స్, వాటర్ ఫౌంటైన్స్, పార్కింగ్, వాల్ పెయింటింగ్స్, పబ్లిక్ టాయిలెట్స్, ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఉద్యానవనాలు, బీచ్ లు సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దుతున్నారు.

అంతర్జాతీయ సదస్సులతో విశాఖనగరంపై ప్రత్యేకశ్రద్ధతో అభివృద్ధిపనులు ‎శరవేగంగా పూర్తిచేశామని గ్రేటర్ విశాఖ మునిసిపల్ కమిషనర్ రాజబాబు తెలిపారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్, ఆతర్వాత జీ20 సమావేశాలతో విశాఖ నగరం ప్రపంచస్థాయి గుర్తింపు పొందడంతోపాటు ఆంధ్రప్రదేశ్ కు పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని అంశం కోర్టులో ఉన్నప్పటికీ సీఎం జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా తీర్చి దిద్దాలని పట్టుదలతో ఉన్నారు. అంతర్జాతీయ సమావేశాలతో విశాఖలోనే అధికార యంత్రాంగంతో బిజీబిజీగా గడపబోతున్నారు.

Tags:    

Similar News