Gas Leakage: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో గ్యాస్ లీకేజీ
Gas Leakage: విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లో గ్యాస్ లీకేజీ కలకలం రేపింది.
Gas Leakage: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో గ్యాస్ లీకేజీ
Gas Leakage: విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లో గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. గ్యాస్ లీకయిందన్న వార్తలతో కార్మికులందరూ ఒక్కసారిగా మెయిన్ గేటుకు పరుగులు తీశారు. అధికారులకు సమాచారమిచ్చారు. సేఫ్టీ అధికారులు ఘటనాస్ధలికి చేరుకుని గ్యాస్ లీకేజీని అదుపు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్లాంట్ కి ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు హెచ్ పీసీఎల్ అధికారులు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని.. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.