Vizag as Executive Capital: ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ రెడీ!

Update: 2020-07-26 05:09 GMT

Vizag as executive capital: ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ రెడీగా ఉంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే సర్వం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. కావాల్సిన భవనాలు, మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగింది. సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఎక్కడ పెట్టాలి. సెక్రటేరియట్ ను ఎక్కడ నుంచి నడపాలి అన్న కీలకాంశాలపై ప్రభుత్వం క్లారిటీ తెచ్చుకుంది. ఇక గవర్నర్ ఆమోదంతో రాజధాని పనులకు తొలి అడుగు పడనుంది.

విశాఖ నగరానికి బౌగోళికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో చరిత్ర ఉంది. ఒకప్పుడు మత్స్యకార పల్లెగా ఉన్న ఈ నగరం ఇప్పుడు మహా నగరంగా అభివృద్ధి చెందింది. వ్యాపార, ఉపాధి, ఉద్యోగాల రీత్యా పక్కనే ఒడిశా మొదలు కొని నేపాల్ వరకు వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.

దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ విశాఖ ధీటుగా పోటీనిస్తోంది. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖలో కొలువుదీరాయి. విశాఖ నగర అభివృద్ధి కోసం విశాఖపట్నం మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే విశాఖ ఆర్థిక రాజధానిగా పేరొందింది.

విశాఖ పరిపాలనా రాజధాని అని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ ప్రభుత్వ ఆఫీసులు, భూముల కోసం అన్వేషణ ప్రారంభించారు అధికారులు. ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల ఆఫీసులకు అనువైన భవనాల కోసం వివరాలను సేకరించారు. తాత్కాలికంగా కార్యాలయాల ఏర్పాటుకు అనుకూలమైన భవనాలు ఎక్కడన్నాయి? శాశ్వతంగా ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని వారు పరిశీంచారు.

ఈ తతంగం జరుగుతుండగానే లాక్ డౌన్ కారణంగా రాజధాని ప్రక్రియకు బ్రేక్ పడింది. లాక్ డౌన్ అనంతరం ఇటీవల కాలంలో రాష్ట్ర అధికారులు విశాఖలో ప్రత్యేక్షమై రాజధాని ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. కాపులుప్పాడ పేరు రాష్ట్రమంతటా మారుమ్రోగుతోంది. ఈ ప్రాంతంలోనే సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వ భూములు అధికంగా ఉండడంతో అనువుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక గవర్నర్, ఇతర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారుల కోసం భవనాలు ఖరారయ్యారు. గవర్నర్ ఉండేందుకు వాల్తేరు క్లబ్, ప్రభుత్వ అధిథిగా గృహం, సీఎం నివాసంగా ప్రచారం పొందిన పోర్టు గెస్ట్ హౌస్ ను కూడా పరిశీలన చేస్తున్నారు. మిగిలిన విభాగాలకు సంబంధించి నగరంలో కొన్ని, కాపులుప్పాడ ప్రాంతంలో మరికొన్ని సిద్ధం చేశారు. ఉద్యోగుల కోసం మధురవాడలో కొన్ని ఫ్లాట్ లు, విల్లాలను హోల్డ్ లో ఉంచారు.

Tags:    

Similar News