'మమ్మల్ని చంపొద్దు'.. మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ

Update: 2019-11-28 04:41 GMT

విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసనలు చెప్పట్టారు గిరిజనులు. మావోయిస్టుల బారిన పడిన 600 మంది గిరిజన కుటుంబాలు మాడిగరువు నుంచి ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేపట్టారు. మావోయిస్టు ఉద్యమం కారణంగా తమ కుటుంబసభ్యులు ఎంత కష్టం అనుభవిస్తున్నారో వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అందులో 'ప్రియమైన మావోయిస్ట్ దయచేసి మమ్మల్ని శాంతియుతంగా జీవించనివ్వండి,' 'దయచేసి మా కుటుంబ సభ్యులను చంపవద్దు,',

'దయచేసి ఈ ప్రాంత అభివృద్ధిని ఆపవద్దు', 'మా ప్రాంతంలో విద్య మరియు రహదారి సౌకర్యాలు కావాలి' , 'సెల్ ఫోన్ టవర్ల సంస్థాపనను ఆపవద్దు' అంటూ వారంతా మావోయిస్టు ఉద్యమానికి వ్యతిరేకంగా ప్లకార్డుల నిరసన వ్యక్తం చేశారు. మావోయిస్టు ఉద్యమ సభ్యులు తమ కుటుంబ సభ్యులను గిరిజన అభివృద్ధికి మద్దతుగా ఉన్నామని చెప్పినప్పటికీ వారి కుటుంబ సభ్యులను క్రూరంగా చంపుతున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే మావోయిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడతారో వారిని చంపేస్తున్నారని.. అంతేకాకుండా గిరిజనులు కొందరు మావోయిస్టులకు డబ్బు ఇవ్వడం మానేసినప్పుడు, వారిని 'ఇన్ఫార్మర్స్' అని ముద్రవేసి చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News