"టాప్ టెన్ రిచెస్ట్ సీటీస్ ఇన్ ఇండియా 2020" లో విశాఖకు స్థానం

Update: 2020-08-27 04:40 GMT

Visakhapatnam spots in the top ten richest cities in India: సుందర సాగరతీరం, సహజ వనరులు, ప్రకృతి అందాలు ఇది విశాఖ ముఖ చిత్రం. అంతేనా పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్దిపథంలో వున్న నగరం రాష్ట్రానికి ఆర్ధిక రాజధాని కూడా. అందుకే విశాఖ జ్యూయల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ గా పేరొందింది. కొన్ని సర్వేల ప్రకారం దేశంలోనే టాప్ టెన్ రిచెస్ట్ సీటీగా కూడా స్థానం సంపాదించుకుంది.

విశాఖ పరిపాలన రాజధాని కాబోతున్న వేళ మరో అరుదైన స్థానం దక్కించుకుంది. "టాప్ టెన్ రిచెస్ట్ సీటీస్ ఇన్ ఇండియా 2020" లో వైజాగ్ కు కూడా చోటు దక్కింది. ఓ ప్రవైటు సంస్థ చేసిన సర్వేలో దేశ వ్యాప్తంగా పది నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖ కూడా వుంది. సూరత్, పూణే, ముంబాయి, చెన్నై, కొల్ కత్తా, హైదరాబాద్, ఢీల్లి, బెంగుళూరు, ఆహ్మదాబాద్, సరసన విశాఖ నిలిచినట్లు ఆ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. విశాఖలో 26 మిలియన్ అమెరికన్ డాలర్ల జీడీపీ కలిగి వుందని, అదే విధంగా 1875 మిలియన్ అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయంతో విశాఖ దూసుకుపోతోందని ఆ సంస్థ స్పష్టం చేసింది. అందుకే విశాఖ టాప్ టెన్ రిచెస్ట్ సీటీస్ లిస్ట్ లో చేరిపోయిందని వెల్లడించింది. అయితే విశాఖ ఆర్దిక పటిష్టతను నిపుణులు కూడా అంచన వేస్తున్నారు. వేగంగా అభివృద్ది చెందడంతోపాటు ప్రజల తలసరి ఆదాయంలో ఏపిలో మిగిలిన జిల్లాల కంటే విశాఖలో ఎక్కువు వుందని అందుకే ఏపి ప్రభుత్వం విశాఖను రాజధానిగా ఎంపిక చేసి వుంటుందని అభిప్రాయపడుతున్నారు.

విశాఖపట్నంలో సువిశాలమైన సాగరతీరం వుంది. రాష్ట్రంలో మత్స్య సంపద మీద వస్తున్న ఆదాయంలో 23% విశాఖ నుండే వస్తుంది. మరో వైపు పోర్ట్, స్టీల్ ప్లాంట్, ఫార్మా కంపెనీలు, ఇతర భారీ పరిశ్రమలు, ప్రకృతి సహజసిద్దమైన అందాలు వుండటంతో పర్యాటక ఆదాయం కూడా వుంది. దీంతో విశాఖ జీడీపీ మొదటి నుండి ఏపీలో ప్రథమ స్థానంలో వుంది. మరోవైపు సహజ వనరులు సమృద్దిగా వుండటంతో రాబోయే రోజులలో కూడా విశాఖ అభివృద్ది చెందే నగరాల జాబితాలో ముందు వుంటుంది. పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళితే విశాఖ అభివృద్ది ప్రపంచపఠంలో మరింత మెరుగైన స్థానంలో వుంటుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.


Tags:    

Similar News