విశాఖలో దారుణం: కాలువలో చిన్నారి శరీరభాగాలు కలకలం
విశాఖ జిల్లాలో అమానుష ఘటన కంచరపాలెం పీఎస్ పరిధిలో దారుణం ఓ కాలువలో చిన్నారి శరీరభాగాలు గుర్తించలేని విధంగా శరీరభాగాలు కాళ్లు, చేతులు ముక్కలుగా లభ్యం లభించని తల భాగం
విశాఖలో దారుణం: కాలువలో చిన్నారి శరీరభాగాలు కలకలం
విశాఖ జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కాలువలో చిన్నారి శరీరభాగాలు లభ్యం కావడం.. స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. అయితే.. చిన్నారి శరీరభాగాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. కాళ్లు, చేతులు ముక్కలుగా లభ్యం కాగా.. తల భాగం ఇంకా లభించలేదు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.