మొంథా తెచ్చిన అదృష్టం...చేపల వేట కంటే.. గోల్డ్ వేటకు సై అంటున్న తీర ప్రాంత ప్రజలు

ఏపీలో తగ్గిన మొంథా తుఫాన్ ఎఫెక్ట్ వేట మొదలుపెట్టిన తీర ప్రాంత ప్రజలు చేపల వేట కంటే.. గోల్డ్ వేటకు సై అంటున్న తీర ప్రాంత ప్రజలు కాకినాడ జిల్లాలో ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం వేట

Update: 2025-10-30 06:57 GMT

మొంథా తెచ్చిన అదృష్టం...చేపల వేట కంటే.. గోల్డ్ వేటకు సై అంటున్న తీర ప్రాంత ప్రజలు

ఏపీలో మొంథా తుఫాన్ ప్రభావం తగ్గిందని ఓ పక్క ప్రజలు ఊపిరి పీల్చుకుంటుంటే... ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు మాత్రం వేటమొదలు పెట్టారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతమంతా బంగారం వేటగాళ్లతో నిడిపోయింది. తుఫాన్ ప్రభావం తగ్గిపోవడంతో... అక్కడ ప్రజలు బంగారం కోసం సముద్ర తీర ప్రాంతంలో వేట మొదలుపెట్టారు. తుఫాన్ వచ్చి పోయిందంటే చాలు సముద్ర కెరటాల నుంచి బంగారం తీర ప్రాంతానికి కొట్టుకొస్తుందని... అక్కడ ప్రజలు బంగారం కోసం వేట మొదలుపెడతారు. బంగారం లభిస్తుందో లేదో కానీ.. దాని కోసం పోటీమాత్రం హోరాహోరీగా సాగుతోంది.

Tags:    

Similar News