జగనన్న అమ్మఒడి.. ఇంకా అప్‌లోడ్ కానీ సమాచారం..

Update: 2019-11-19 04:20 GMT

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న అమ్మఒడి కార్యక్రమం జనవరి 9న ప్రారంభం కానుంది. తల్లులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించినందుకు గాను రూ .15 వేల ఆర్థిక సహాయం పొందనున్నారు. అయితే ఈ పథకానికి మంగళవారం సాయంత్రం కల్లా పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. కానీ కొన్ని చోట్ల ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పిల్లల సమాచారాన్ని అప్‌లోడ్ చేయడానికి మంగళవారం సాయంత్రం (సాయంత్రం 5 గంటలకు)తో ఈ గడువు ముగుస్తుండటంతో ఈ పనిని పూర్తి చేయడంలో అనేక పాఠశాలల హెచ్‌ఎంలు తలమునకలయ్యారు.. కానీ, సర్వర్‌ల వైఫల్యం కారణంగా పనిని పూర్తి చేయడంలో హెచ్‌ఎంలు సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అధిక లోడ్ కారణంగా, రోజంతా సర్వర్లు చాలా సార్లు డౌన్ అయిపోయాయి. దీనికి తోడు కొత్త బ్యాంకు ఖాతాలను ఈ మధ్యనే ఓపెన్ చెయ్యడంతో.. అవి ఇంకా అనుసంధానం కాలేదు.

కాగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పిల్లల డేటాను అప్‌లోడ్ చేసిన వెంటనే అమ్మఒడి పథకం అమలుకు సంబంధించిన పరిపాలనా ప్రక్రియ ప్రారంభమవుతుంది. పిల్లల సమాచారం అప్‌లోడ్ చేసే పనిని ఈరోజు సాయంత్రం 5 గంటలకు హెచ్‌ఎంలు పూర్తి చేయాల్సి ఉంటుంది. తరువాత లబ్ధిదారులను ఎంపిక చేసే ధృవీకరణ ప్రక్రియను ప్రారంభిస్తారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ, వార్డ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఒక నెలలోపు జాబితాను ఖరారు చేస్తారు. ఇప్పటివరకు, 90 శాతానికి పైగా పిల్లల సమాచారాన్ని అప్‌లోడ్ చేసింది ప్రభుత్వం. వైట్ రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, పిల్లల సంఖ్య, ఆదాయం మరియు ఇతర వివరాలను నమోదు చేస్తున్నారు.

పరిపాలనా ప్రక్రియ (ధృవీకరణ) పూర్తయిన తరువాత, సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు సమీక్షించిన డేటాను సంబంధిత మునిసిపల్ వార్డులు మరియు గ్రామాల్లోని సంక్షేమ మరియు విద్యా సహాయకులకు పంపుతారు. ధృవీకరణ తరువాత, అర్హత కలిగిన తల్లుల జాబితాను నవంబర్ 25 నుండి 27 వరకు గ్రామ / వార్డ్ సెక్రటేరియట్స్‌లో ప్రదర్శిస్తారు. కాగా గ్రామ / వార్డ్ వాలంటీర్ల డేటా క్షేత్ర ధృవీకరణ డిసెంబర్ 1, 2019 నాటికి పూర్తవుతుందని.. జాబితాను తిరిగి హెచ్‌ఎంలకు అందజేస్తామని ఆన్‌లైన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఒక అధికారి తెలిపారు. తుది జాబితా డిసెంబర్ 15 మరియు 18 మధ్య గ్రామసభలలో ఆమోదించబడుతుందని ఆయన తెలిపారు. లబ్ధిదారుల జాబితాను డిసెంబర్ 9 న విలేజ్ / వార్డ్ సెక్రటేరియట్స్ సోషల్ ఆడిట్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌లో ప్రదర్శిస్తారు.. అదే రోజు తల్లుల ఖాతాలలో రూ.15 వేలు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.

Tags:    

Similar News