నేడు విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం

Update: 2020-10-16 02:20 GMT

విజయవాడ వాసుల దశాబ్దాల స్వప్నం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్.. ఇటీవల ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా.. ప్రారంభానికి నోచుకోలేదు. ఎన్నోరోజులుగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇవాళ దీని ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ ను వర్చువల్ గా ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నారు. వర్చువల్‌ ప్రారంభోత్సవంలో పలువురు కేంద్ర, రాష్ట్ర అధికారులు పాల్గొంటారు. దీంతో పాటు మొత్తం 61 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంఖుస్ధాపనలు కూడా జరగనున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఢిల్లీలోని నితిన్‌ గడ్కరీ ఆఫీసు నుంచి, ఇటు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. గతంలో ఈ ప్రారంభోత్సవం నాలుగుసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో వర్చువల్‌ గా ప్రారంభించాలని గడ్కరీ, జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ రాష్ట్రంలోనే అతి పెద్ద నది పరివాహక ప్రాంత వంతెన కానుంది.

Tags:    

Similar News