కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం వాయిదా.. కారణం ఇదే..

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ ..

Update: 2020-09-18 03:09 GMT

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి గడ్కరీకి కరోనా పాజిటివ్‌ రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కరోనా కారణంగా మంత్రి గడ్కరీ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో ఫ్లైఓవర్‌ ప్రారంభం మూడోసారి వాయిదా పడింది. తొలుత దీనిని సెప్టెంబర్ 4న ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ ఫ్లైఓవర్ ను సీఎం వైఎస్‌ జగన్, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీలతో ప్రారంభం చేయించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.

అయితే ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశంలో సంతాప దినాలు కొనసాగుతున్న తరుణంలో.. ఈ నెల 8కి మార్చారు.. అయితే ఈసారి ముఖ్యమంత్రి షెడ్యూల్ బిజీగా ఉండటంతో ప్రారంభోత్సవం ఈరోజుకు మరోసారి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ కూడా శుక్రవారమే జాతికి అంకితం చేయాల్సి ఉన్నా.. నితిన్ గడ్కరీ కరోనా భారిన పడడంతో మళ్ళీ వాయిదా పడింది. కరోనా నుంచి నితిన్ గడ్కరీ కోలుకున్న తరువాతే తదుపరి ప్రారంభోత్సవ తేదిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది.

Tags:    

Similar News