పోలవరంపై కేంద్రాన్ని నిలదీసిన విజయసాయిరెడ్డి

Update: 2019-07-15 10:53 GMT

పోలవరంపై రాజ్యసభలో ప్రశ్నల పరంపర కొనసాగింది. పోలవరంపై ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంపై ప్రశ్నలు సంధించారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సీబీఐ విచారణకు ఆదేశించే ఆలోచన ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. నిధుల విడుదల కోసం ఆర్థికశాఖకు అంచనాలను పంపిచకుండా రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ ఆమోదానికి పంపించాల్సిన ఆవశ్యకత ఏమిటని మరోసారి ప్రశ్నించారు. దీని వల్ల మరింత కాలయాపన జరిగే అవకాశం ఉందని, ఎప్పటిలోగా ఈ కమిటీ తన ఆమోదం తెలుపుతుందా అని నిలదీశారు. ఎప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేస్తుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News