చంద్రబాబుపై మరోసారి విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు
* అమూల్ రాకతో రైతులు సంతోషంగా ఉన్నారు -విజయసాయిరెడ్డి * జీవోలను చంద్రబాబు భోగి మంటల్లో వేయమంటున్నారు -విజయసాయిరెడ్డి * రైతు బాగుపడితే చంద్రబాబుకు ఎందుకు కడుపుమంట..? -విజయసాయిరెడ్డి
Chandrababu and Vijayasai (file Image)
ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎంపీ విజయసాయిరెడ్డి. అమూల్ రాకతో వరి పండించే రైతులే కాదు, పాడి రైతులు కూడా అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను చంద్రబాబు భోగి మంటల్లో వేయమంటున్నారని మండిపడ్డారు. రైతు బాగుపడితే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట అని ఫైర్ అయ్యారు. చిత్తుగా ఓడిపోయి రెండేళ్లు అవుతున్నా చంద్రబాబుకు తాను ఎందుకు ఓడిపోయాడో కూడా తెలియదన్నారు. దేవాలయాల ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజలనే నిందిస్తున్నాడు చంద్రబాబు అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.