Vijaya Sai Reddy Resign: ఎంపీ పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా
Vijaya Sai Reddy Resign: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి శనివారం రాజీనామా చేశారు.
Vijaya Sai Reddy Resign: ఎంపీ పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా
Vijaya Sai Reddy Resign: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి శనివారం రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ కు ఆయన తన రాజీనామా పత్రాన్ని అందించారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు విజయసాయి రెడ్డి శుక్రవారం ఎక్స్ లో ప్రకటించారు.తాను ఏ పార్టీలో చేరడం లేదని కూడా ఆయన వివరించారు. రాజకీయాలకు దూరం కావాలనే తన నిర్ణయంలో ఎలాంటి ప్రలోభాలు కానీ, ఒత్తిడి కానీ లేదని ఆయన వివరించారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కూడా ఆయన తెలిపారు.
ఈ ప్రకటనకు అనుగుణంగానే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు కారణమైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వైఎస్ జగన్ తో విజయసాయిరెడ్డి తన ప్రయాణం కొనసాగించారు. ఆస్తుల కేసులో జగన్ తో పాటు విజయసాయిరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కొన్ని నెలలపాటు ఆయన జైలుకు కూడా వెళ్లారు.
2016లో వైఎస్ఆర్‌సీపీ తరపున రాజ్యసభలో తొలిసారిగా అడుగుపెట్టారు. పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా జగన్ ఆయనకు అవకాశం ఇచ్చారు. దీంతో ఆయనకు పలు పార్టీల ఎంపీలు, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో మంచి సంబంధాలు ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది. 2022లో విజయసాయిరెడ్డిని జగన్ మరోసారి రాజ్యసభకు పంపారు. అయితే రెండో టర్మ్ పదవి పూర్తి కాకుండానే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు