Rajini: మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు
Rajini: చంద్రబాబు అధికారంలోకి వస్తే... ఆయన బినామీలు సంపద సృష్టించుకుంటారు
Rajini: మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు
Rajini: మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి విడదల రజనీ విరుచుకుపడ్డారు. తొలి విడత మేనిఫెస్టో విడుదల చేయడం ఏంటో ఎవరికీ అర్థం కాని విషయమని... సీఎం జగన్‌ను తిట్టడానికే మహానాడు పెట్టినట్టుగా ఉందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమానికి సైకిల్ ముందు చక్రం, వెనుక చక్రం అభివృద్ధికి నిదర్శనమని చంద్రబాబు ప్రకటించుకోవడం హాస్యాస్పదం అన్నారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు అంటున్నారని, ఆయన అధికారంలోకి వస్తే బినామీలు, ఆయన మాత్రమే సంపదను సృష్టించుకుంటారని మంత్రి విడదల రజనీ దుయ్యబట్టారు.