రామతీర్థం ఆలయం పునర్నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లి

Update: 2021-01-23 09:17 GMT

రామతీర్థం ఆలయం పునర్నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లి


రామతీర్థం ఆలయాన్ని పునర్‌నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి వెల్లంపల్లి. రామతీర్థానికి తిరుపతి నుంచి విగ్రహాలను తరలించామని విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ట చేసి ఆలయ నిర్మాణం చేపడతామన్నారు. పూర్వవైభవం వచ్చేలా ఆలయ నిర్మాణం తీర్చిదిద్దుతామని సంవత్సరకాలంలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం పలుకగా, ఆలయాధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News