Vellampalli Srinivas: నాకు అడక్కుండానే మంత్రి పదవి ఇచ్చారు
Vellampalli Srinivas: సామాజిక విప్లవానికి సీఎం జగన్ అడుగులు వేశారు
Vellampalli Srinivas: నాకు అడక్కుండానే మంత్రి పదవి ఇచ్చారు
Vellampalli Srinivas: సామాజిక విప్లవానికి సీఎం జగన్ అడుగులువేశారన్నారు దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సామాజిక స్పూర్తితో నూతన క్యాబినెట్ ఏర్పాటు చేశారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే తనకు అడక్కుండానే మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అప్పట్లోనే రెండున్నరేళ్ల పదవి కాలం ఉంటుందని చెప్పారన్నారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేశామన్న ఆందోళన ఎవరికి లేదన్నారు. ఆర్యవైశ్యుల పట్ల టీడీపీ, జనసేన ముసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. దిక్కుమాలిన రాజకీయాలు చేసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు నమ్మొద్దని వెల్లపల్లి విజ్ఞప్తి చేశారు.