Vallabhaneni Vamsi: క్షిణీంచిన వల్లభనేని వంశీ ఆరోగ్యం..ఆందోళనలో భార్య, కుటుంబ సభ్యులు
Vallabhaneni Vamsi: క్షిణీంచిన వల్లభనేని వంశీ ఆరోగ్యం..ఆందోళనలో భార్య, కుటుంబ సభ్యులు
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బందిపడుతుండటంతో ఆయనను వెంటనే కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వంశీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. వంశీపై నమోదు అయిన 8 కేసులకు సంబంధించి గత కొద్దిరోజులుగా పోలీసులు వైసీపీ నేతను విచారిస్తున్నారు. ప్రస్తుతం వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
గత వంద రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. అయితే తాజాగా వంశీని బావులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారించేందుకు కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. శనివారం కూడా విచారణ జరపాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ఆయనను స్టేషన్లోనే ఉంచారు. అయితే రాత్రి ఊపిరి పీల్చుకునేందుకు వంశీ ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీకి శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ ఉండటంతో పోలీసులు కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే వంశీకి వైద్యం అందిస్తున్నారు.
వంశీ ఆరోగ్యం సీరియస్ గా ఉండటంతో ఆయన భార్య వంకజశ్రీ, వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. వంశీకి మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే ఎయిమ్స్ కు తరలించాలని..ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతుంటే కేసుల పేరుతో వేధించడం సరికాదని వైసీపీ నేత పేర్ని నాని ఫైర్ అయ్యారు. వంశీ ఆరోగ్యానికి ఏదైన జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.