వల్లభనేని వంశీ ఆ నిర్ణయం తీసుకున్నారా!

శాసన సభ్యత్వానికి, టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి వల్లభనేని వంశీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉంటానని

Update: 2019-10-30 08:47 GMT

శాసన సభ్యత్వానికి, టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి వల్లభనేని వంశీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉంటానని వంశీ చెప్పినా.. క్యాడర్ మాత్రం ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. వంశీకి మద్దతుగా చాలా మంది లీడర్లు టీడీపీ రాజీనామా బాట పట్టారు.. ఇటు వంశీని బుజ్జగించే బాధ్యతను.. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ నారాయణకు అప్పగించారు. వారిద్దరూ వంశీ తో భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.. కానీ తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఏ పార్టీలో చేరతారోనన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

కానీ వచ్చే నెల మూడో తేదీన వంశీ.. వైసీపీలో చేరుతారన్న వార్త మాత్రం ప్రచారంలో ఉంది. ఈ ప్రచారంపై వంశీ కూడా వివరణ ఇవ్వలేదు. దీంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమనే తెలుస్తోంది. అయితే వైసీపీలో చేరే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుంది. దానికి కూడా వంశీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. మళ్ళీ పోటీ చేసేందుకు మాత్రం జగన్ అవకాశం ఇవ్వరని ఆ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డు లో అంటున్నారు. వంశీపై పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావుకు ఉపఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారని.. వంశీకి ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. వంశీ మాత్రం ఇప్పటికి వరకు ఎటువంటి నిర్ణయమూ ప్రకటించలేదు.

Tags:    

Similar News