భద్రాద్రి రాములోరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
Bhadrachalam: విద్యుత్ వెలుగులతో మెరిసిపోతున్న ఆలయం
భద్రాద్రి రాములోరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
Bhadrachalam: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రవక్త అద్దెన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూర్తిగా విద్యుత్తు వెలుగులతో అలంకరించారు. విద్యుత్ దీపాల మధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం భక్తులను అబ్బురపరుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు.. విద్యుత్ కాంతులతో అందంగా తిర్చిదిద్దబడ్డ ఆలయాన్ని చూసి.. మంత్రముగ్ధులవుతున్నారు.
ఇక.. ఈ నెల 23 వరకు ఈ ఉత్సవాలు జరగనుండగా.. ఉత్సవాలను వీక్షించేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో.. భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. మరోవైపు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.