Tirumala: తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం
Tirumala: జనవరి 1 అర్థరాత్రి 12 గంటల వరకు వైకుంఠద్వారాలు తెరచి ఉంటాయి
Tirumala: తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం
Tirumala: వైకుంఠద్వార దర్శనానికి వచ్చే రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 23వ తేదీ వేకువజామున 1:45 గంటలకు వైకుంఠద్వార దర్శనం మొదలవుతుందని చెప్పారు. ముందుగా ప్రముఖులు దర్శించుకున్నాక...సామాన్య భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. 2024 జనవరి 1వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు వైకుంఠద్వారాలు తెరచి ఉంటాయని తెలిపారు. 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు వైకుంఠద్వార ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.