Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
Vaikunta Ekadasi: ప్రధాన ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. దీంతో.. ఆలయాల్లో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు చేశారు. యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి, అన్నవరంలో సత్యనారాయణస్వామి, భద్రాచలంలో భద్రాద్రి రామయ్య, సింహాచలంలో అప్పన్నస్వామి, ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి, మంగళగిరిలో శ్రీలక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.