Konaseema Tirupati: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
Konaseema Tirupati: 5న స్వామి వారి కల్యాణం.. 10న చక్రస్నానం
Konaseema Tirupati: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
Konaseema Tirupati: కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం 11వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపటి నుంచి 10వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ స్వామి వారికి వాహన సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 5న స్వామి వారి కళ్యాణం, 10న చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. వాడపల్లి వెంకన్న దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దర్శనం, అన్న ప్రసాద ఏర్పాట్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.