Unlock Guidelines: నేటి నుంచి బార్లకు గ్రీన్ సిగ్నల్..

Unlock Guidelines | మరో మద్యం మత్తు పట్టణాల్లో అర్ధరాత్రి వరకు ఆవహించనుంది..

Update: 2020-09-19 04:25 GMT

Unlock Guidelines | మరో మద్యం మత్తు పట్టణాల్లో అర్ధరాత్రి వరకు ఆవహించనుంది... ఇప్పటివరకు వైన్ షాపులకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా బార్లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వీటిని వచ్చే ఏడాది వరకు యధాతధంగా కొనసాగించేందుకు కోవిద్ పేరుతో 20శాతం మేర ఫీజు పెంచింది. దీంతో పాటు దీంతో పాటు బార్లకు సరఫరా చేసే మద్యంపై 10 శాతం అదనంగా టాక్స్ విధిస్తూ చర్యలు తీసుకుంది.

లాక్‌డౌన్‌తో మూతపడిన బార్లు.. మళ్లీ తెరుచుకోనున్నాయి. బహుశా.. శనివారం నుంచే తెరుచుకుంటాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం 3 జీవోలు జారీ చేసింది. పనిలోపనిగా... 'ఆదాయం పడిపోయింది. నిదులు కావాలంటూ లైసెన్సు ఫీజులపై 20 అదనంగా 'కొవిడ్‌ ఫీజు' విధించాలని నిర్ణయించింది. అన్‌లాక్‌ 4.0లో రెస్టారెంట్లను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో బార్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 840 బార్ల లైసెన్సులు కొనసాగిస్తున్నట్లు, 2021 జూన్‌ 30 వరకు వర్తిస్తుందని జీవోలలో ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రస్తుత బార్‌ లైసెన్సీల కాలపరిమితి 2022 వర కు ఉన్నా ఈ ఏడాది జూన్‌ వరకే ఫీజులు చెల్లించారు. అప్పట్లో ఫీజులు చెల్లించాల్సి ఉన్నా కరోనా వల్ల 31 మంది మినహా ఎవరూ చెల్లించలేదు. అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా అందరి లైసెన్సులు కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల నుంచి లైసెన్సు ఫీజులు చెల్లించాలని స్పష్టంచేసింది.

అంటే ఈనెల 18 రోజులు గడిచినా మొత్తానికి ఫీజు చెల్లించాలి. దీనిపై ఎక్సైజ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. కాగా బార్ల లైసెన్సు ఫీజుపై 20 శాతం కొవిడ్‌ ఫీజు విధిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ పేరిట ఓ జీవో జారీ అయ్యింది. ఇందులో... మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఏం చేస్తున్నదీ వరుసగా పొందుపరిచి, చివరికి 'ఆదాయం పడిపోయింది. డబ్బులు కావాలి' అంటూ బార్లపై కొవిడ్‌ ఫీజు గురించి రాశారు. ''రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. వైద్య సేవల ఖర్చు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆదాయ మార్గాలు పెంచుకోక తప్పని పరిస్థితి. అందువల్ల... ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని పన్నులు, ఫీజులు పెంచక తప్పడం లేదు'' అని తెలిపారు. బార్ల లైసెన్సు ఫీజు, రిజిస్ర్టేషన్‌ ఫీజులపై 20శాతం కొవిడ్‌ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అదే సమయంలో... బార్లకు సరఫరా చేసే మద్యంపై 10శాతం అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ విధించారు. 

Tags:    

Similar News