గుంటూరు వాటర్ షెడ్ మహోత్సవంలో మాజీ సీఎం జగన్‌పై పెమ్మసాని విమర్శలు

గుంటూరు వాటర్ షెడ్ మహోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని వాటర్ షెడ్ మహోత్సవంలో మాజీ సీఎం జగన్‌పై పెమ్మసాని విమవర్శలు జగన్ మాట కల్తీ, ప్రభుత్వం నడిపిన విధానం కల్తీ- పెమ్మసాని చంద్రశేఖర్

Update: 2025-11-11 10:45 GMT

గుంటూరు వాటర్ షెడ్ మహోత్సవంలో మాజీ సీఎం జగన్‌పై పెమ్మసాని విమర్శలు

గుంటూరు వాటర్ షెడ్ మహోత్సవంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం పాలనపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మాజీ సీఎం జగన్‌ మాట కల్తీ, ప్రభుత్వం నడిపిన విధానం కల్తీ అని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు సత్యం, సేవ, సమర్థత అనే మూడు మార్గాలని ఎంచుకుని తమ ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. 2024 ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది చెప్పారు కానీ.. బీజేపీ, జనసేనతో కలిసి వెళ్లామని అన్నారు. మీరు వేసిన ఓటు ఆంధ్రప్రదేశ్‌ను సువర్ణ అక్షరాలతో మార్చేసే విధంగా ఉందన్నారు పెమ్మసాని. 

Tags:    

Similar News