బోటు ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష

-కచ్చులూరు బోటు ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష -రిస్కూ ఆపరేషన్స్‌పై ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో రాజమండ్రిలో సమావేశం -సమీక్షలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, పోలీస్ అధికారులు

Update: 2019-09-22 11:38 GMT

కచ్చులూరు బోటు ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాజమండ్రి వెళ్లిన కిషన్ రెడ్డి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు. బోటు వెలికితీత పనులు, రెస్క్యూ ఆపరేషన్‌పై వివరాలు తెలసుకున్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లి కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఐజీ ఏఎస్ ఖాన్, ఎస్పీ పాల్గొన్నారు.  

Tags:    

Similar News