Tirupati: తిరుపతిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
Tirupati: పోలీసుల ముసుగులో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణ
Tirupati: తిరుపతిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
Tirupati: పోలీసుల ముసుగులో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసారు. వివిధ జిల్లాల్లో దాదాపు 89 కేసులు ఉన్న ఇద్దరు మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 31 ఎర్రచందనం దుంగలు, ఆరు సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ కడప జల్లా చాపాడు మండలానికి చెందిన షేక్ చంపతిలాల్ బాషా, షేక్ చంపతి జాకీర్‌గా గుర్తించారు. వీరిద్దరూ సోదరులని, వీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. ఈ ఇద్దరు స్మగ్లర్లను రిమాండ్‌కు తరలించామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న 31ఎర్రచందనం దుంగల విలువ 20 లక్షలు ఉంటుందన్నారు.