Tirumala : బీజేపీ ఎంపీకి తిరుమలలో చేదు అనుభవం

భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు అలిపిరి టోల్‌గేట్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఎంపీ శశికళ తన భర్తతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లారు.

Update: 2020-03-01 11:05 GMT
Sasikala Mp File Photo

భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు అలిపిరి టోల్‌గేట్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఎంపీ శశికళ తన భర్తతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లారు. అలిపిరి టోల్‌గేట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది శశికళను అడ్డుకున్నారు. ఆమె కారుపై ఉన్న బీజేపీ గుర్తును తొలగించాలని సూచించారు. అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని ఎంపీ శశికళ చెప్పారు. దీంతో సిబ్బంది ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఎంపీ శశికళ ఆరోపించారు.

టీడీడీ సిబ్బంది తన పట్ల ప్రవర్తించిన తీరును తను మొబైల్లో చిత్రీకరించగా.. సిబ్బంది అడ్డుకుని తన ఫోన్‌ను లాక్కున్నారని ఎంపీ చెప్పారు. ఈ ఘటనపై ఎంపీ శశికళ పుష్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ సిబ్బంది తనకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

అన్నాడీఎంకే చెందిన శశికళ పుష్పను 2016లో ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. ఇటీవలే శికళ పుష్ప బీజేపీలో చేరారు. ఆమె రాజ్యసభ సభ్యత్వం మరి కొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. గతంలో తూత్తుకుడి మేయర్‌గానూ శికళ పుష్ప పని చేశారు.


Full View

Tags:    

Similar News