Tirumala News: తిరుమల క్యూలైన్‌లో... నిరీక్షణ లేదిక...

Tirumala News: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు పోటీ పడుతుంటారు.

Update: 2022-10-21 09:20 GMT

Tirumala News: తిరుమల క్యూలైన్‌లో... నిరీక్షణ లేదిక...

Tirumala News: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు పోటీ పడుతుంటారు. ఒక్కసారయినా స్వామి వారిని దర్శించుకోవడంతో చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రణాళిక రూపొందించింది. భక్తులు నిరీక్షణ లేకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో... చూద్దాం.

తిరుమలకు వచ్చే భక్తులకు ఒక్కసారయినా వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకోవాలని కోరిక ఉంటుంది. సామాన్యులు సైతం ఎమ్మెల్యే, ఎంపీ, తదితర ప్రొటోకాల్ ప్రముఖుల లేఖలతో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతున్నారు. ఎలాంటి సిఫార్సు లేకుండా గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు మాత్రం కొంత ఇబ్బందులు తప్పడం లేదు. రాత్రంతా క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు జరిగే వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు తీసుకురానుంది. స్వామి వారికి నిత్యకైంకర్యాలు అయిన వెంటనే ఉదయం 5 నుంచి 10 గంటల వరకు మొదటి సామాన్యులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్రేక్ దర్శనం ప్రారంభించేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ ఈ విధానంతో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం గదుల కేటాయింపుపై ఒత్తిడి తగ్గించేలా టీటీడీ ప్రయోగాత్మకంగా నిర్వహించనుంది సత్ఫలితాలు సాధిస్తే ఆచరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీటీడీ.

శ్రీవారి మహా లఘు దర్శనం కాకూండా స్వామి వారిని శ్రీవారి గర్భాలయానికి మొదటి గడప వద్ద నుంచి దర్శించుకోవాలని కోరుకుంటారు. వీఐపీ సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు ట్రస్టులకు విరాళం అందించిన దాతలకు అందించే బ్రేక్ దర్శనం, శ్రీవారి ట్రస్టులకు విరాళం అందించిన దాతలకు అందించే బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వీఐపీ ప్రొటోకాల్ బ్రేక్ దర్శనం ద్వారా భక్తులు వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. ఇలా గతంలో ఒకరోజు రెండుసార్లు వీఐపీ దర్శనాలు కల్పించే వారు. అయితే ప్రముఖుల తాకిడి పెరగడం సాయంత్రం దర్శనం చేసుకున్న వారే ఉదయం దర్శనం చేసుకోవడం లాంటి ఆరోపణలతో ఒక రోజుకు ఒకసారి మాత్రమే వీఐపీ దర్శనాలు కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకుంది. రాత్రి నుంచి స్వామి వారి దర్శనం కోసం క్యూలో వేచి ఉన్న భక్తులకు 10 గంటల తరవాతే దర్శనం లభించేది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్ దర్శన సమయాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని వివరించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని వీఐపీ, శ్రీవాణి దర్శనాలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామన్నారాయన. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు సామాన్య భక్తులు పెద్దపేట వేస్తున్నామంటూ ప్రచారం చేయడం తప్ప ఇలా ఆచరణలోకి తీసుకురావడం శుభపరిమాణం అని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News