Tirupati: టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై ఏడాదికి ఒక్కసారే..

Tirupati: శ్రీవారి ఉత్సవ విగ్రహాల పరిరక్షణకై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సంవత్సరంలో మొత్తం 470 సార్లు మలయప్ప స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించడం వల్ల వాటిల్లే నష్టాలను గుర్తించింది.

Update: 2021-03-28 09:35 GMT

Tirupati: టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై ఏడాదికి ఒక్కసారే..

Tirupati: శ్రీవారి ఉత్సవ విగ్రహాల పరిరక్షణకై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సంవత్సరంలో మొత్తం 470 సార్లు మలయప్ప స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించడం వల్ల వాటిల్లే నష్టాలను గుర్తించింది. వాటిని నివారించేందుకు నిత్యం నిర్వహించే పలు అర్చనలు, అభిషేకాలు, ఇక ముందు ఏడాదికోసారి నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.

నిత్యకళ్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతి నిత్యం ఏదోక సేవ నిర్వహిస్తుంటారు. కలియుగ దైవం కొలువైయున్న ఆనంద నిలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి నిత్యం విశేషాభిషేకాలు, విశేషార్చనలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఉత్సవం నుండి బ్రహ్మోత్సవాల వరకూ మలయప్ప స్వామి వారు లేని వేడుకే ఉండదు. శ్రీ వేంకటేశ్వరుడి ప్రతి రూపంగా పిలువబడే మలయప్పస్వామిని ఉత్సవమూర్తి అని పిలుస్తారు. నిత్యం బంగారు వాకిలి దాటి నిర్వహించే సేవలు., ఉత్సవాలు, అభిషేకాలు మలయప్పస్వామి అందుకుంటారు.

ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవాల నేపథ్యంలో ఏడాదిలో మొత్తం 470 సార్లు ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా ఉత్సవ ముర్తులకు పాలు, తేనే, పెరుగు, వివిధ సుగంధ పరిమళాలు వెదజల్లే ద్రవ్యాలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నిత్యం అభిషేకం నిర్వహించడం ద్వారా ఉత్సవ మూర్తుల విగ్రహాలు అరుగుదలకు గురవుతున్నట్లు అర్చకులు గుర్తించారు. స్వామి వారి పాదాలు, ముఖ బింబం అరుగుదల అవుతుండటంతో వైఖానస అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అర్చకులు, ఆగమ‌ సలహాదారులు తమ సూచనలను టీటీడీ ఉన్నతాధికారులకు తెలియజేసారు.

ఇకపై ప్రతి సోమవారం‌ నిర్వహించే విశేషపూజ, ప్రతి ‌బుధవారం నిర్వహించే సహస్ర కళాషాభిషేకం, ప్రతినిత్యం నిర్వహించే ఆర్జిత వసంతోత్సవాలను ఏడాదిలో‌ ఓ సారి మాత్రమే నిర్వహించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఉత్సవ విగ్రహాలు అరుగుదలను పూర్తిగా అరికట్ట వచ్చని టీటీడీ భావిస్తోంది.

Tags:    

Similar News