TTD: హనుమాన్ జన్మస్థలంపై నేడు ప్రకటన చేయనున్న టీటీడీ

TTD: అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం * ఆధారాలతో ప్రకటన చేయనున్న తిరుమల తిరుపతి దేవస్థానం

Update: 2021-04-21 04:30 GMT

టీటీడీ (ఫైల్ ఫోటో)

TTDహనుమంతుడు ఎక్కడ పుట్టాడు అనే చర్చ ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హర్యానా, జార్ఖండ్ అంటూ ఎవరికి నచ్చినట్టుగా వారు చెప్తున్నారు. ఇప్పుడు మన తిరుమల గిరుల్లోనే ఆ పవనసుతుడు జన్మించాడనే కొత్త చర్చ మొదలైంది. జాపాలి తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలి అంటున్నారు. తిరుమల గిరుల్లోనే ఆంజనేయుడు జన్మించాడని ఈ ప్రాంతాన్ని టీటీడీ నిర్లక్ష్యం చేస్తోందని భక్తులు కొందరు చరిత్రకారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో రామభక్తుడు హనుమంతుడు ఎక్కడ జన్మించాడో తేల్చాలని టీటీడీ ఆదేశించింది.

పురాణాలు, ఇతర గ్రంథాలను పరిశోధించాలని అధికారులను ఆదేశించింది. అయితే ఆంజనేయుని జన్మస్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రి అని తిమ్మసముద్రం సంస్కృత పాఠశాల రిటైర్డ్ అధ్యాపకులు అన్నదానం చిదంబరం శాస్త్రి పేర్కొంటున్నారు. ఆయన హనుమాన్ పుట్టిన ప్రాంతంపై పరిశోధనలు చేశారు కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర ప్రాంతవాసులు గ్రంథాలను ఆధారంగా చేసుకొని తిరుమల అనే నిర్ధారణకు వచ్చారన్నారు. 50 సంవత్సరాల కృషికి ఫలితం దక్కిందన్నారు.

అయితే టీటీడీ అన్ని ఆధారాలతో ఇవాళ హనుమంతుడి జన్మస్థలంపై ప్రకటన చేయనుంది. చరిత్ర , పురాణ, ఇతిహాస గ్రంథాల ఆధారాలు చూపించనుంది. హనుమంతుడి జన్మస్థానం ఆధారాల సేకరణకు డిసెంబర్‌లో టీటీడీ కమిటీ ఏర్పాటు చేసింది. పలుసార్లు సమావేశమై చర్చించారు కమిటీ సభ్యులు ఐదు పురాణాలు, పలు గ్రంథాలు కమిటీ పరిశీలించింది. హనుమంతుడి జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించే ఆధారాలున్నట్టు కమిటీ ప్రకటించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ అంజనాద్రిపై కీలక ప్రకటన చేయనుంది.

Tags:    

Similar News