శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఎల్లుండి డిసెంబర్‌ నెల రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

Special Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది.

Update: 2022-11-09 10:53 GMT

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఎల్లుండి డిసెంబర్‌ నెల రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

Special Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. డిసెంబర్‌ నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 11వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పుల కారణంగా డిసెంబరు కోటా టికెట్ల విడుదల ఆలస్యమైంది.

ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌(https://tirupatibalaji.ap.gov.in/#/login)లోకి వెళ్లాలి. రిజిస్టర్‌ చేసుకోవాలి. లేదూ ముందుగానే రిజిస్టర్‌ చేసుకుని ఉంటే లాగిన్‌ వివరాలు ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత లేటెస్ట్‌ అప్‌డేట్‌లో ఉండే రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లపై క్లిక్‌ చేయాలి. ఇక తర్వాత మీకు కావాల్సిన తేదీ, సమయాన్ని సెలక్ట్‌ చేసుకొని అమౌంట్‌ పే చేస్తే సరిపోతుంది.

Tags:    

Similar News