TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల.. బంగారం, నగదు డిపాజిట్ల వివరాలు ఇవే..

Tirumala Assets: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి.

Update: 2022-11-05 09:32 GMT

TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల.. బంగారం, నగదు డిపాజిట్ల వివరాలు ఇవే..

Tirumala Assets: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారిని పేద.. ధనవంతుడు, సామాన్యుడు అనే తేడా లేకుండా సేవించుకుంటూ తమ ఇష్ట దైవానికి తమ స్టేజ్ కు తగినట్లు కానుకలను సమర్పిస్తారు. దీంతో స్వామివారికి డబ్బు, బంగారం, వెండి, వజ్రాలు ఇలా అనేక రూపాల్లో వెలకట్టలేనన్ని ఆస్తులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చే నగదును కార్పస్ ఫండ్ గా జాతీయ బ్యాంకుల్లో చెల్లిస్తుంది టీటీడీ. నగదుతో పాటు గోల్డ్ డిపాజిట్స్ చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో టీటీడీ డిపాజిట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని తీవ్ర స్థాయిలో ప్రచారం సాగుతోంది. దీనిపై స్పందించిన ఈవో ఏవి ధర్మారెడ్డి.. సోషయల్ మీడియాలో టీటీడీపై విషప్రచారం తగదని హెచ్చరించారు. టీటీడీపై బురద చల్లడానికే డిపాజిట్లపై సోషల్ మీడియాలో వందంతులు సృష్టిస్తున్నారని తెలిపారు.

మొత్తం బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్ ఉన్నట్టుగా ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. 10,258.37 కేజీల బంగారం ఉందని..మూడేళ్లలో శ్రీవారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగాయని ఈవో తెలిపారు. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా పేర్కొన్నారు. 2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా.. అది ఇప్పుడు 10,258. 37కి చేరిందని తెలిపారు. అంతేకాకుండా స్వామి వారి నగలు, నగదును అధిక వడ్దీలు ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తున్నామని వెల్లడించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో స్వామి వారి నగదు, నగలను డిపాజిట్ చేయబోమంటూ ప్రకటించారు. 

Tags:    

Similar News