TTD Meeting: కొనసాగుతున్న టీటీడీ పాలక మండలి సమావేశం
TTD Meeting: భవిష్యత్తులో కొండచరియలు విరిగిపడే సమస్య పరిష్కారానికి.. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న టీటీడీ బోర్డు
TTD Meeting: కొనసాగుతున్న టీటీడీ పాలక మండలి సమావేశం
TTD Meeting: TTD పాలకమండలి సమావేశం కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగుతున్న ఈ సమావేశంలో 63 అంశాలపై చర్చిస్తున్నారు. రెండవ ఘాట్ రోడ్డు మరమ్మతులపై, భవిష్యత్తులో కొండచరియలు విరిగి పడే సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది టీటీడీ బోర్డు. తిరుమల, తిరుపతిలో పలు ఇంజనీరింగ్ పనులకు పాలకమండలి ఆమోదం తెలుపనున్నది.
టీటీడీ గోల్డ్ డిపాజిట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి SBIకి మార్చే అంశంపై కూడా చర్చించనున్నారు. టీటీడీ మార్కెటింగ్ విభాగంలో కొనుగోళ్లకు సంబంధించి కూడా పాలకమండలి నిర్ణయం తీసుకోనున్నది. అదే విధంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇప్పటికే ఉన్న దర్శనాల సంఖ్యను కుదించాలా లేక పెంచాలన్న దాపికై కూడా ఈ సమావేశంలో చర్చింస్తున్నారు.