TTD: టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం.. జగన్ సర్కార్ తీసుకొచ్చిన మరో విధానం రద్దు

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది.

Update: 2024-10-05 06:34 GMT

Tirumala: తిరుమలలో అపచారం..కొండపైకి కోడిగుడ్ల కూర..అన్యమతస్తులు

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. దాంతో మళ్లీ పాత పద్ధతిలోనే టెండరింగ్ విధానం అమల్లోకి రానుంది. కాగా, మునుపటి జగన్ ప్రభుత్వం 2019లో రివర్స్ టెండర్ విధానం అమలుకు జీవో నెంబర్ 67 తీసుకొచ్చింది.

టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో టీటీడీ అధికారులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు.

Tags:    

Similar News