TTD EO: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి !
TTD EO: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి !
TTD EO: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి !
TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతిచెందారు. గత మూడు రోజులుగా చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఎక్మో ఆధారిత చికిత్స పొందుతున్నారు. హార్ట్ ఎటాక్ రావడంతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. ఆయనను బతికించేందుకు డాక్టర్లు మూడు రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఈ ఉదయం ఆయన కన్ను మూశారు. జనవరిలో వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన చంద్రమౌళి ఇలా కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళికి టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. జనవరిలో తిరుమలలో వివాహానికి ముహూర్తం నిర్ణయించగా.. చంద్రమౌళి తన పెళ్లికి శుభలేఖలు పంచుతున్నారు. ఆదివారం చెన్నై ఆళ్వారుపేటలో బంధువులకు ఆహ్వానపత్రిక అందజేశారు. కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల్లోనే వివాహం జరగాల్సి ఉండగా చంద్రమౌళి మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.