TTD Calendars: భ‌క్తుల‌కు అందుబాటులోకి కొత్త టీటీడీ డైరీలు.. క్యాలెండర్లు.. కావాలంటే ఇలా ఆర్డర్‌ చేయండి..

TTD Calendars: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంత ఆసక్తి చూపిస్తారో.. క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేయడానికి అంతే ఆసక్తి చూపిస్తుంటారు.

Update: 2022-11-28 08:15 GMT

TTD Calendars: భ‌క్తుల‌కు అందుబాటులోకి కొత్త టీటీడీ డైరీలు.. క్యాలెండర్లు.. కావాలంటే ఇలా ఆర్డర్‌ చేయండి..

TTD Calendars: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంత ఆసక్తి చూపిస్తారో.. క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేయడానికి అంతే ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం టీటీడి ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులోకి వచ్చాయి. తిరుమలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో వీటిని ఉంచినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపాల్లో వీటిని అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

టీటీడీ క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు.'తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌' వెబ్‌సైట్‌లో 'పబ్లికేషన్స్‌'ను క్లిక్‌ చేసి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేసుకోవచ్చు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలు తపాలా శాఖ ద్వారా ఇంటి వద్దకే చేరుతాయి.

ధరలు ఇలా ఉన్నాయి

12 పేజీల క్యాలెండర్‌ రూ.130

డీలక్స్‌ డైరీ రూ.150

చిన్న డైరీ రూ.120

టేబుల్‌ టాప్‌ క్యాలెండర్‌ రూ.75

శ్రీవారి పెద్ద క్యాలెండర్‌ రూ.20

పద్మావతీ దేవి క్యాలెండర్‌ రూ.20

శ్రీవారు, పద్మావతీ దేవి క్యాలెండర్‌ రూ.15

తెలుగు పంచాంగం క్యాలెండర్‌ రూ.30

Tags:    

Similar News