టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం

Update: 2019-11-19 06:16 GMT

టీటీడీ పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకనుంచి ప్రాంతీయ బ్యాంకుల్లో కాకుండా జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే రూ.1500 కోట్లు జాతీయ బ్యాంకులో డిపాజిట్‌ చేస్తుంది. టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం సరైంది కాదని పలువురు భక్తులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అంతేకాదు గతంలో రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో టీటీడీ సొమ్మును జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని కోర్టు తెలిపింది. పాలకమండలి సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News