TTD: గోవిందరాజ స్వామి రథం సేఫ్‌.. విష ప్రచారాలు నమ్మొద్దు

Tirupati: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Update: 2023-06-16 10:29 GMT

TTD: గోవిందరాజ స్వామి రథం సేఫ్‌.. విష ప్రచారాలు నమ్మొద్దు

Tirupati: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు స్వల్ప స్థాయిలో ప్రారంభమైన మంటలు ఒక్కసారిగా భవనం మొత్తం వ్యాప్తించాయి. ఐదంతస్తుల భవనంలో నాలుగు అంతస్థులలోనూ చెక్కతో చేసే ఫోటో ప్రేమ్ లు అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

చుట్టూ దట్టమైన పొగ అలుముకోవడంతో గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆలయం పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. 6 ఫైర్ ఇంజస్ లతో నాలుగు గంటలుగా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే టీటీడీ ఈవో, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు ప్రమాద మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. గోవింద రాజస్వామి ఆలయం రథం కాలిపోయింది అంటూ విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. శ్రీ గోవింద రాజస్వామి రథంకు ఎలాంటి ప్రమాదం జరగలేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేసారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు. 

Tags:    

Similar News