Tirumala Laddu: శ్రీవారి లడ్డూ ప్రసాదం బరువు తగ్గింపు ప్రచారంపై టీటీడీ క్లారిటీ
Tirumala Laddu: తిరుమల లడ్డూ ప్రసాదం బరువు తగ్గిందంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Tirumala Laddu: శ్రీవారి లడ్డూ ప్రసాదం బరువు తగ్గింపు ప్రచారంపై టీటీడీ క్లారిటీ
Tirumala Laddu: తిరుమల లడ్డూ ప్రసాదం బరువు తగ్గిందంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 160 నుంచి 180 గ్రాముల వరకు ఉండాల్సిన లడ్డూ కేవలం 100 గ్రాములే ఉందని. ఓ భక్తుడు తాను తీసుకున్న లడ్డూను కౌంటర్ సిబ్బందిని తూకం వేయమని కోరగా.. అందులో లడ్డూ బరువు తక్కువగా చూపించింది. తూకంలోని పొరపాటుతో లడ్డూ బరువు అలా చూపించిందని లడ్డూ ప్రసాదం ఎట్టి పరిస్థితుల్లోనూ 160 గ్రాముల తక్కువ ఉండదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.