TTD: జులై 15, 16న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే ప్రకటన
TTD: జులై 15, 16న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే ప్రకటన
తిరుమల: శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో జులై 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. జులై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం వంటి విశిష్ట వేడుకల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే జులై 14, 15 తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులను తప్పించి ఇతరుల వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సులు స్వీకరించబోమని స్పష్టం చేసింది.